Moviesఅఖండ సినిమా పై మ‌హేశ్ బాబు రియాక్షన్ అద్దిరిపోలే.. ఫ్యాన్స్ హ్యాపీ..!!

అఖండ సినిమా పై మ‌హేశ్ బాబు రియాక్షన్ అద్దిరిపోలే.. ఫ్యాన్స్ హ్యాపీ..!!

గత కొంత కాలంగా బాలయ్య కు సరైన హిట్ పడలేదు. దీంతో ఆశలన్నీ బోయపాటి తో చేస్తున్న అఖండ సినిమా పైనే పెట్టుకున్నారు. ఇక మాంచి హిట్ కోసం ఆకలి మీద ఉన్న బాలయ్యతో బోయపాటి జత కట్టడంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారి బాలయ్య. నటసింహా నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా వచ్చిన చిత్రం “అఖండ”. ఈరో జు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద ఘన విజయం అందుకుంది. దీంతో ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన కేరక్టర్‌ వరదరాజులుగా నటించిన శ్రీకాంత్‌. అతని కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిదీ ఆ కేరక్టర్‌ని ఎలివేట్‌ చేసింది. ఇంటర్వెల్‌లో బాలయ్యతో తలపడే సీన్లు… వేటికవే ప్రత్యేకంగా అనిపించాయి. భారీ అంచనాలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది ఈ చిత్రం..ఉదయం నుంచే అఖండ ప్రీమియర్ షో లతో ధియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా పైన సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

 

బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు రియాక్ట్ అయ్యాడు. ఈ సినిమా పై స్పందిస్తూ తన అధికారిక ట్వీట్టర్ ఖాతానుండి పోస్ట్ చేసారు. అఖండ భారీ ఓపెనింగ్స్ తో షురూ అయింద‌ని విన‌డానికి చాలా సంతోషంగా ఉంది అంటూ ఓ ట్వీట్ చేసాడు. మహేష్ బాబు పోస్ట్ చేస్తూ.. “చప్పట్లు కొడుతున్న బొమ్మ పోస్ట్ చేసి నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీను, టీమ్ మొత్తానికి అభినందన‌లు తెలిపారు.

దీంతో బాల‌య్య సినిమాపై మ‌హేశ్ బాబు ట్వీట్ చేయ‌డంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అఖండ‌పై మ‌రింత హైప్ క్రియేట్ అవుతుందంటూ కామెంట్స్ పెడూతున్నారు. ఇక త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, మ‌హేశ్‌బాబు UNSTOPPABLE షోలో సంద‌డి చేయ‌నున్న విషయం తెలిసిందే.మ‌హేశ్ పెట్టిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

 


 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news