Moviesమైండ్ బ్లాకింగ్ న్యూస్‌.. లైగ‌ర్ సినిమాలో బాల‌య్య‌..!

మైండ్ బ్లాకింగ్ న్యూస్‌.. లైగ‌ర్ సినిమాలో బాల‌య్య‌..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు కెరీర్‌లోనే ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాడు. మ‌రోవైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖండ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద అఖండ గ‌ర్జ‌న చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు తిరుగులేని ఊపు తీసుకువ‌చ్చాడు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య గురించి మైండ్ బ్లాక్ అయ్యే ఓ న్యూస్ వ‌చ్చేసింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా – అనన్య పాండే హీరోయిన్‌గా పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో లైగ‌ర్ సినిమా వ‌స్తోంది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్గా వ‌స్తోన్న ఈ సినిమాను పూరి పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సిన‌మాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఓ గెస్ట్ రోల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ బ‌జ్ ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తోంది. పూరికి, బాల‌య్య‌కు మంచి రిలేష‌న్ ఉంది.

గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమా ఓ మోస్తరుగానే ఆడినా బాల‌య్య క్యారెక్ట‌ర్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఫిదా చేసేసింది. ఈ క్ర‌మంలోనే పూరితో బాల‌య్య మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. పూరిపై ఉన్న న‌మ్మ‌కంతో బాల‌య్య లైగ‌ర్‌లో ఓ క్యామియో రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడ‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రానుంది. లైగ‌ర్‌లో బాల‌య్య క‌నిపిస్తే సినిమాకు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news