Moviesసోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న బాల‌య్య ల‌వ్లీ వీడియో (వీడియో)

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న బాల‌య్య ల‌వ్లీ వీడియో (వీడియో)

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఫుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రు. 23 కోట్ల గ్రాస్‌తో పాటు రు. 14 కోట్ల‌కు పైగా థియేట్రిక‌ల్ షేర్ సొంతం చేసుకుంది. యేడాదిన్న ర కాలంగా పెద్ద సినిమా.. అందులోనూ ఊర‌మాస్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేసి ఉన్న మాస్ ఫ్యాన్స్‌కు అఖండ పెద్ద జాత‌ర‌లా ఉంది.

తొలి షో నుంచే అఖండ‌కు హిట్ టాక్ రావ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు పోటెత్తుతూనే ఉన్నారు. ఆంధ్రాలో టిక్కెట్ల రేట్లు త‌గ్గించేసినా, బెనిఫిట్ షోలు లేక‌పోయినా కూడా అఖండ గ‌ర్జ‌న మాత్రం ఆగ‌డం లేదు. బాల‌య్య చాలా రోజుల త‌ర్వాత త‌న న‌ట విశ్వ‌రూపాన్ని చూపిండంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాల‌య్య‌కు సంబంధించి ఓ బ్యూటిఫుల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బాల‌య్య ఓ చిన్న పాప‌తో చాలా ప్రేమ‌గా ఉన్నారు. బాల‌య్య‌కు చిన్న పిల్ల‌లు అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఇటీవ‌ల ఓ చిన్నారి పాప‌కు క్యాన్స‌ర్ రావ‌డంతో.. ఆ పిల్ల త‌ల్లిదండ్రులు బాల‌య్య‌ను క‌లిశారు. చ‌లించిపోయిన బాల‌య్య బ‌స‌వ తార‌కం హాస్ప‌ట‌ల్ వైద్యుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు కో ఆర్డినేట్ అయ్యి మ‌రీ ఆ పాప‌కు వైద్యం చేయించి.. క్యాన్స‌ర్ త‌గ్గేలా చూశారు.

ఇక తాజా వీడియోలో బాల‌య్య ఆ పాప‌తో ఎంతో ప్రేమ‌గా ముచ్చ‌టిస్తున్నారు. ఈ వీడియో అఖండ సినిమా షూటింగ్ టైంలో తీసింద‌ని తెలుస్తోంది. ఇక బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఖండలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక బాల‌య్య నెక్ట్స్ మ‌లినేనీ గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు రెడీ అవుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news