Moviesప్ర‌భాస్ చేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌.. కార‌ణం ఇదే..!

ప్ర‌భాస్ చేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌.. కార‌ణం ఇదే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్పక్కరలేదు. ఒక హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటే తెలుగు ప్రేక్షకులు వారిని బాగా మెచ్చుకుంటారు. ఆ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఎగబడి మరీ చూస్తారు. సమంత – నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వచ్చిన సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో చూశాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – అనుష్క కు కూడా టాలీవుడ్ లో మాంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరూ కలిసి సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో నటించారు.

వీరిద్దరి జంట తెర మీద ఎంత చూడముచ్చటగా ఉంటుందో తెలిసిందే. మిర్చి – బిల్లా – బాహుబలి 1,2 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో వీరు నటించారు. ఒకానొక దశలో ప్రభాస్ – అనుష్క ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. కూడా పుకార్లు షికార్లు చేశాయి. నిజజీవితంలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలు అయితే బాగుంటుందని ఎంతో మంది సినీ అభిమానులు భావించారు. అయితే వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ స్నేహితులుగానే ఉన్న‌ట్టు హింట్స్ ఇస్తుంటారు.

ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సాహో కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యే ఫ్లాప్ టాక్ తో కూడా భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజమండ్రికి చెందిన ప్రభాకర్ అనే ప్రభాస్ అభిమాని ఎలాగైనా ప్రభాస్ ని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఒకసారి ముంబై వెళ్లి తన ఫ్యామిలీతో కలిసి ప్రభాస్ ని కలిసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి గురైయ్యాడ‌ట‌ ప్రభాకర్. తన కుమార్తె చేతిని ప్రభాస్ చేతిలో పెట్టి ఒక మంచి పేరు పెట్టమని అడిగాడట. అప్పుడు ప్రభాస్ వెంటనే ఆ పాపకు అనుష్క అనే పేరు పెట్టాడు. అనుష్క అంటే ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. అనుష్క అంత మంచితనం ఈ పాపకు కూడా రావాలనే ప్రభాకర్ కుమార్తెకు ప్రభాస్ పేరు ఆ పెట్టాడట. తర్వాత ఈ విషయం తెలిసిన అనుష్క తీవ్ర‌మైన భావోద్వేగానికి గురైందని వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news