Moviesప్రభాస్ తో మరో సినిమా.. క్రేజీ ప్ర‌క‌టన చేసిన జ‌క్క‌న్న..!!

ప్రభాస్ తో మరో సినిమా.. క్రేజీ ప్ర‌క‌టన చేసిన జ‌క్క‌న్న..!!

బాహుబ‌లి సిరీస్ ఎంతటి ఘన విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ ఖ్యాతిని ఎల్ల‌లు దాటించి ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త బాహుబ‌లి సినిమాకే ద‌క్కుతుంది. ఆ మాట‌కు వ‌స్తే ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు సినిమా రేంజ్‌ను బాహుబ‌లి ప్ర‌పంచానికి చాటి చెప్పింద‌నే అనాలి. ఓ ప్రాంతీయ సినిమాకు ఇంత స‌త్తా ఉంటుందా ? అని ఎంతో మంది మ‌హామ‌హులు నోరెళ్ల‌బెట్టేలా చేసింది బాహుబ‌లి. ఈ సినిమా ఏకంగా రు. 2 వేల కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తూ బాలీవుడ్ కి సైతం చమటలు పట్టించిన ఈ చిత్రం ఎన్నో, ఎన్నెన్నో రిక్కర్డులను అధిగమించి సూపర్ హిట్ గా నిలిచింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో వెయ్యికోట్ల కలక్షన్ చేసిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన బాహుబలి కంక్లూజన్ కి పని చేసిన ప్రతిఒక్కరూ గర్విస్తున్నారు. ఇందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా భల్లాల దేవగా భయంకరమైన విలనిజం చూపించిన దగ్గుబాటి రానాకీ బాహుబలి చేతినిండా సినిమాలను తెచ్చి పెట్టింది. ఇక ప్రభాస్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.

అయితే బాహుబ‌లికి సిక్వెల్ గా బాహుబ‌లి – 3 తీయాల‌ని తెలుగు సినిమా అభిమానుల‌తో పాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా రాజ‌మౌళి చాలా సార్లు రిక్వ‌స్ట్ చేశారు. కానీ రాజ‌మౌళి బాహుబ‌లి – 3 పై ఎలాంటి అనౌన్స్ చేయ‌లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్‌లో తన నెక్ట్స్ ప్రాజెక్టులపై అనౌన్స్ మెంట్ ఇవ్వాలని పలువురు కోరగా.. ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ కాంబినేషన్ లో బాహుబలి 3 తీయనున్నట్టు ప్రకటించాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు తెరకెక్కుతుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.

ఖచ్చితంగా హీరో అయితే ప్రభాస్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. కాగా ఈ సినిమా ఇప్పట్లో అయితే తెరకెక్కించే సూచనలు కనిపించడంలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతో రాజమౌళి ఓ మూవీ చేయనున్నారు. ప్రభాస్ చేతిలో సైతం ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక వీళ్ల ఇద్దరు కలిసి సినిమా చేయాలి అంతే సుమారు మరో మూడు నాలుగు సంవత్స్రాలు అయిన పడుతుంది అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news