Moviesబాల‌య్య కోసం రంగంలోకి ఇద్ద‌రు స్టార్ హీరోలు...!

బాల‌య్య కోసం రంగంలోకి ఇద్ద‌రు స్టార్ హీరోలు…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అఖండ‌. ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్గా న‌టించిన ఈ సినిమాను మిర్యాల ర‌వీంద్‌రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీరి కాంబోలో సింహా, లెజెండ్ సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖ‌చ్చితంగా అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌నే అంచ‌నాల‌తో ఈ సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది.

డిసెంబ‌ర్ 2న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీగా రిలీజ్ అవుతోంది. అఖండ‌ను ఓవ‌ర్సీస్‌లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వ‌చ్చే వారం భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. ఈ ఈవెంట్ గురించి అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ ఈవెంట్‌కు యంగ్టైగ‌ర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వ‌స్తున్నార‌ని… బాబాయ్‌, అబ్బాయ్‌ల‌ను చాలా రోజుల త‌ర్వాత ఒకే వేదిక‌పై చూస్తున్నామంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక మ‌రో అప్‌డేట్ కూడా వ‌చ్చేసింది. ఈ ఈవెంట్‌కే ఎన్టీఆర్‌తో పాటు నేచుర‌ల్ స్టార్ నాని కూడా మ‌రో గెస్ట్‌గా రాబోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే నాని బాల‌య్య అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు గెస్ట్ వ‌చ్చారు. ఇక బాల‌య్య శ్రీరామ‌దాసు సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తే ఈవెంట్‌లో మామూలు ర‌చ్చ ఉండ‌దు.

ఇక ఎన్టీఆర్ -బాల‌య్య ఒకే వేదిక‌పై క‌నిపిస్తే నంద‌మూరి అభిమానుల‌కు అంత‌కు మించిన ఆనందం ఏం ఉంటుంది. ఇక ఈ ఈవెంట్‌ను ఏపీలోనూ, హైద‌రాబాద్‌లోనూ కూడా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news