Gossipsవారెవ్వా..బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్న బన్నీ...

వారెవ్వా..బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్న బన్నీ…

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌..ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఈయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పుష్ప’. టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మంధన డీ గ్లామరస్ రోల్ లో పుష్పరాజ్‌ ప్రేయసిగా నటిస్తోంది. ఇక ఫాహిద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు హైలెట్ గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. డిసెంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే బన్నీ ప్రమోషన్స్‌తో మరింత బిజీ గా మారనున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అఫ్దే లెవల్ లో ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టారు చిత్ర మేకర్స్. ఈ క్రమంలో భాగంగా బన్నీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. హిందీలో ఈ మూవీని ప్రమోట్‌ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతూ..సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో ఐకాన్‌స్టార్‌ స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది.

అల్లూ అర్జున్, సల్మాన్‌ ఖాన్‌లకు ఇప్పటికే పరిచయం ఉండగా.. బాలీవుడ్‌లో బన్నీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చేందుకు బిగ్‌బాస్ ఒక వేదిక అవ్వనుందని చెబుతున్నారు. కగా బన్నీ నటించిన ‘దువ్వాడ జగన్నాథం(డీజే)’ లోని సీటీమార్‌ సాంగ్‌కు సల్మాన్‌ ‘రాధే’ మూవీలో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. కాగా తన పాటను వాడుకోనిచ్చినందుకు సల్లూ భాయ్‌ బన్నీకి థ్యాంక్స్‌ చెప్పగా… ‘రాధే’ మూవీలో మీ స్టెప్పులు అదిరిపోయాయని సల్మాన్‌పై ప్రశంసలు కురిపించాడు స్టైలిష్‌ స్టార్‌. ఇక మళ్లీ ఇద్దరు ఎనర్జిటిక్ స్టార్ హీరో ఒక్కే తెర పై కనిపించనున్నారు అంటేనే అభిమానులు సంబరపడుతున్నారు. ఇదిలా వుంటే బన్నీ హిందీలో మల్టీస్టారర్‌ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడని, ఇందులో అల్లు అర్జున్‌తో పాటు హీరో షాహిద్‌ కపూర్‌ నటించనున్నారని ఓ వార్త వైరల్‌ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news