Moviesమీరే నా గాడ్ ఫాద‌ర్..జై బాల‌య్య అంటూ అభిమానుల్లో ఉత్సాహాని నింపిన...

మీరే నా గాడ్ ఫాద‌ర్..జై బాల‌య్య అంటూ అభిమానుల్లో ఉత్సాహాని నింపిన పూర్ణ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలు గ్యాప్ లేకుండా వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక విధంగా నేటి యువతరం హీరోల కంటే కూడా ఐదు పదుల వయసు దాటినా సీనియర్ నటులు చాలా వేగంగా సినిమాలను సెలెక్ట్ చేసి పూర్తి చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన “అఖండ” అనే సినిమా డిసెంబరు 2 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సినిమాలో బాలయ్య పక్కన ప్రగ్నా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు ఈ చిత్రంలో అందాల బ్యూటీ పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. నందమూరి బాలకృష్ణ అభిమానులు.. ఆయన సినిమాలకు వెళ్లినా, మరే ఇతర సినిమాలకు వెళ్లినా సరే ఎక్కువగా అరిచి, గోల చేసే పదం ‘జై బాలయ్య’. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ పదంతోనే నటి పూర్ణ నందమూరి అభిమానుల మనసులో ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకుంది. న‌వంబ‌ర్ 27న శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూర్ణ మాట్లాడిన మాట‌లు అందరిని ఆకట్టుకున్నాయి . టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన అల్లు అర్జున్ ను, హీరో బాల‌కృష్ణ‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది పూర్ణ‌.

ఆమె మాట్లాడుతూ.. “నందమూరీ బాలకృష్ణ గారి లాంటి హీరో పక్కన నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద భారీ బ‌డ్జెట్ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను కు ధ‌న్య‌వాదాలు.. అంటూ జై బాల‌య్య అని నిన‌దించింది. అంతే ఈ మాటతొ స్టేడియంలో ఈలలు,అరుపులతో దద్దరిల్లింది. ఇక నేను కేర‌ళ నుంచి వ‌చ్చా అని చెప్పిన పూర్ణ.. చాలా మంది ఆర్టిస్టుల‌తో ప‌నిచేశా. కానీ బాలయ్య గారి దగ్గర చేయడం మోర్ స్పేషల్ అని చెప్పుకొచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే బాల‌కృష్ణ లాంటి ఎన‌ర్జిటిక్ హీరో పక్కన నటించడం నా అదృష్టం. ఇప్పటి వరకు నేను బాలయ్య లాంటి న‌టుడితో ప‌నిచేయ‌లేదు. నిజంగా మీరే నా రోల్ మోడ‌ల్‌.. మీరే నా గాడ్ ఫాద‌ర్ సార్ అంటూ బాలకృష్ణ ను పొగిడేసారు పూర్ణ‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news