Gossipsఆ విషయంలో చైతన్యని బలవంతం చేసిన సమంత..ఇదేమి షాకింగ్ ట్విస్ట్..?

ఆ విషయంలో చైతన్యని బలవంతం చేసిన సమంత..ఇదేమి షాకింగ్ ట్విస్ట్..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత పెళ్లి తరువాత డిఫరెంట్ క్యారెక్టర్లను ఎన్నుకుంటూ సినిమాలు చేసింది. ఈ క్రమంలో వరుస విజయాలను అందుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని పేరు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రీజన్స్ చెప్పకుండానే విడాకులు తీసుకుంటున్నాం అని ప్రక్టించేసింది ఈ లవ్లీ కపుల్.

అయితే, సమంత నాగచైతన్య విడిపోయిన తరువాత కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంట..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత నాగచైతన్య తో కలిసి ఉంటున్న ఇంట్లోనే ఉంటూ ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టిన్నట్లు తెలుస్తుంది.

ఇక విడాకుల తరువాత సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ విషయాల్లు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే వీరి మధ్య జరిగిన ఎన్నో విషయాలు బయటకి రాగా..తాజాగా మరో సంచలన మ్యాటర్ లీకైన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య తన తండ్రితో కలిసి బంగార్రాజు అనే సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ షాకింగ్ ఎమిటంటే చైతన్య ఈ బెబ్ సిరీస్ లో నెగిటివ్ పాత్రలో నటించనున్నారట. అయితే నిజానికి చై కి వెబ్ సిరీస్ లో నటించడం అసలుఇష్టం లేదనే టాక్ వినిపిస్తుంది. కానీ సమంతనే బలవంతంగా ఈ వెబ్ సిరీస్ కు సైన్ చేయించిందట. చైతన్యకి ఇష్టం లేకపోయినా ఈ వెబ్ సిరీస్ లో సమంత కోసం నెగిటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news