Moviesటాలీవుడ్‌లో బీటెక్ చదివిన సెలబ్రిటీలు వీళ్లే..!

టాలీవుడ్‌లో బీటెక్ చదివిన సెలబ్రిటీలు వీళ్లే..!

కొంతమంది చదువు అబ్బక సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే , మరి కొంత మంది బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివి కూడా నటన మీద ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ..తమదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఎవరెవరు బీటెక్ పూర్తి చేసి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. వారి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1. అక్కినేని నాగార్జున:
చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాగార్జున అమెరికాలో ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పట్టా అందుకున్నాడు.

2.వెన్నెల కిషోర్:
అమెరికాలోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు కిషోర్. అంతే కాదు ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేశాడు.

3. రీతూ వర్మ:
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పట్టా అందుకుంది.

4. శేఖర్ కమ్ముల:
హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పట్టా అందుకున్నాడు.

5. అవసరాల శ్రీనివాస్:
అమెరికాలోని నార్త్ డకోటా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తీ చేసి , ఆ తర్వాత అక్కడ కొన్నాళ్ళ పాటు ఉద్యోగం కూడా చేశాడు.

6. తాప్సీ :
న్యూఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ లో ఇంజినీరింగ్ చేసింది.

7. అనిల్ రావిపూడి:
ఈయన కూడా ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు.

8. రామ్ గోపాల్ వర్మ:
సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

9. కళ్యాణ్ రామ్:
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. అమెరికా లో ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుని, అక్కడే కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు.

10. అభిజిత్:
జె.ఎన్.టి.యు హైదరాబాద్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news