Moviesఅభిమానుల అంచనాలను పెంచేసిన “పుష్ప” లీక్డ్ వీడియో..థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం..!!

అభిమానుల అంచనాలను పెంచేసిన “పుష్ప” లీక్డ్ వీడియో..థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన కీలక విషయాలు, వీడియోలు, పాటలు ఇలా ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇవి ఇంకాస్త ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఇటీవల పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ‘పుష్ప’ మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి.. మరోసారి ఇలా జరిగితే ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాదు పుష్ప సినిమా షూటింగ్ లో సెల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేసారు అనే వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం..” పుష్ప “సెట్స్ నుండి మరో వీడియో లీకైన్నట్లు తెలుస్తుంది. లీకైన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. నవంబర్ 4న దీపావళి సందర్భంగా రాకింగ్ డ్యాన్స్ నంబర్ నుండి స్టిల్‌ను పంచుకున్నారు. దాదాపు 1000 మందికి పైగా డ్యాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించిన్నత్లు తెలుస్తుంది.


అయితే తాజాగా లీక్ అయిన వీడియో అదే పాట చిత్రీకరణకు సంబంధించినది. ఆ వీడియోలో “హే బిడ్డా ఇది నా అడ్డా” అంటూ మాస్ బీట్ వినిపిస్తుండగా, రంగురంగుల పొగ మధ్య అల్లు అర్జున్ పలువురు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో అదిరిపోయే స్టెప్పులేస్తున్నాడు. ఓ ఆకాతాయి.. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ”వెయిటింగ్ పుష్ప మావా.. హే బిడ్డా ఇది నా అడ్డా” అని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “పుష్ప” మూవీ.. రెండు భాగాలుగా విడుద‌ల కానున్న‌ది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ వీడియో చూస్తుంటే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అన్పిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news