Moviesరామ్‌చ‌ర‌ణ్ కంటే ఉపాస‌న వ‌య‌స్సులో ఎంత పెద్దో తెలుసా..!

రామ్‌చ‌ర‌ణ్ కంటే ఉపాస‌న వ‌య‌స్సులో ఎంత పెద్దో తెలుసా..!

తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవికి నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి పాపులారిటీ ఉందో చూస్తూనే ఉన్నాం. ఆయన వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రి బాటలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ తనపై వస్తున్న విమర్శలకు పూర్తిగా చెక్ పెట్టేశారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న చరణ్ … మరోవైపు తన తండ్రి చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య‌ సినిమా కూడా చేస్తున్నారు.

ఆ తర్వాత వరుసగా సుకుమార్ సినిమాను కూడా పట్టా లెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు వ్యాపారరంగం లోనూ చరణ్ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక రామ్చరణ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉపాసన ఫ్యామిలీ జీవితంతో పాటు అటు అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చూస్తూ బిజీగానే ఉంటారు.

చరణ్-ఉపాసనవి వేర్వేరు దారులు అయినా వీరిద్దరి అభిరుచులు ఒకటి కావడంతో వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వయసులో రామ్ చరణ్ కన్నా ఉపాసన నాలుగు సంవత్సరాలు పెద్దది. అయితే వీరి అభిప్రాయాలు, మ‌న‌సులు కలవడంతో.. వీరి మ‌ధ్య నాలుగేళ్ల వ‌య‌స్సు గ్యాప్ ఉన్నా కూడా రెండు కుటుంబాలకు చెందిన వారు వీరి పెళ్లికి ఒప్పుకొన్నారు.

ఇక ఉపాసన, రామ్ చరణ్ దంపతులు ఇటీవలే 10 కోట్ల రూపాయలతో కళ్ళు చెదిరిపోయే రీతిలో అద్భుతమైన ఇంద్రభవనం నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అక్కడే నివాసం ఉంటున్నారు. ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలతో పాటు ఒక న్యూట్రిషనిస్ట్ గా సోషల్ మీడియా వేదికగా ఎన్నో హెల్త్ టిప్స్ చెపుతూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news