Moviesబాల‌య్య‌కు ల‌క్కీ హీరోయినే న‌య‌న‌తార ఫేవ‌రెట్ హీరోయిన్‌..!

బాల‌య్య‌కు ల‌క్కీ హీరోయినే న‌య‌న‌తార ఫేవ‌రెట్ హీరోయిన్‌..!

ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో లేడీ సూప‌ర్‌స్టార్ కొన‌సాగుతోన్న న‌య‌న‌తార‌కు పోటీయే లేదు. నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతున్నా కూడా న‌య‌న‌తార క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. న‌య‌న‌తార సౌత్ లో అన్ని భాష‌ల్లో ఉన్న స్టార్ హీరోల‌తో గ‌త 15 ఏళ్లుగా ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించి.. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టింది. న‌య‌న‌తార ఉందంటే చాలు సినిమా క్రేజ్‌తో పాటు మార్కెట్ కూడా పెరుగుతుంది.

ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తేనే అదిరిపోయే బిజినెస్ జ‌రుగుతోంది. అది న‌య‌న్ స‌త్తా. సౌత్‌లో చాలా మంది స్టార్ హీరోల‌కు పోటీగా ఆమె రెమ్యున‌రేష‌న్ ఉంటోంది. న‌య‌న్‌తో న‌టించేందుకు సౌత్‌లో ఉన్న సీనియ‌ర్ హీరోల నుంచి జూనియ‌ర్ హీరోల వ‌ర‌కు అంద‌రూ ఎంతో ఆశ‌తో ఉంటారు. న‌య‌న‌తార‌ది మాళ‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ అయినా కూడా ఆమె సౌత్‌లో అన్ని భాషల సినిమా ప్రేక్ష‌కుల మ‌దిలో చోటు ద‌క్కించుకుంది.

ఆమె ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమెకు కూడా ఫేవ‌రెట్ న‌టులు ఉన్నార‌ట‌. ఆమె ఫేవ‌రెట్ ఎవ‌రో కాదు సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్‌. ఒక‌ప్పుడు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని సిమ్రాన్ ఏలేసింది. తెలుగులో కూడా ఆమె అంద‌రు స్టార్ హీరోల‌తో న‌టించింది. ఇక యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అయితే ఆమె ల‌క్కీ హీరోయిన్‌. బాల‌య్య కెరీర్లో తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్లుగా ఉన్న స‌మ‌రసింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు రెండు సినిమాల్లోనూ ఆమే హీరోయిన్‌గా చేసింది. సిమ్రాన్ అంటే న‌య‌న‌తార‌కు పిచ్చ ఇష్టం అట‌.

ఎంతో మంది నయనతార అభిమానులు కూడా నయనతార ఎక్కువగా అభిమానించే నటీనటులు ఎవరు అన్న విషయాన్ని చాలానే సోషల్ మీడియా వేదికగా వెతికారు. ఇక నయనతార అభిమానించే హీరో హీరోయిన్లు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార ఫేవరెట్ హీరోయిన్ సిమ్రాన్. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన సిమ్రాన్ నటన అభినయం అంటే నయనతారకు చాలా ఇష్టమట. చిన్నప్పుడు సిమ్రాన్ సినిమాలను చాలాసార్లు చూసేదట నయనతార. ఇక హీరోల లో దళపతి విజయ్ నయనతార ఫేవరెట్ హీరో నట. ఇక విజయ్ సినిమాలను కూడా మిస్ కాకుండా చూస్తుందట నయనతార.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news