Moviesహీరో నితిన్ ఆస్తులు చూస్తే క‌ళ్లు జిగేలే... అన్నీ కాస్ట్‌లీయే..!

హీరో నితిన్ ఆస్తులు చూస్తే క‌ళ్లు జిగేలే… అన్నీ కాస్ట్‌లీయే..!

యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో బిజీ బిజీ హీరో గా ఉన్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తనయుడు అయిన నితిన్ తేజ దర్శకత్వంలో 2003లో వచ్చిన జయం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నా మ‌ధ్య‌లో వ‌రుస ప్లాపుల‌తో కెరీర్ ప‌రంగా తీవ్ర‌మైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప‌ద మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ త‌ర్వాత విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ఇష్క్ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాడు.

ఆ త‌ర్వాత నితిన్ ఆ తర్వాత కథాబలం ఉన్న హిట్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. భీష్మ – రంగ్ దే – మ్యాస్ట్రో వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. నితిన్ ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే తండ్రి సుధాక‌ర్ రెడ్డి నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌. త‌ల్లి పేరు విజ‌య‌ల‌క్ష్మి. నితిన్‌కు నిఖితారెడ్డి అనే అక్క కూడా ఉంది. నితిన్ చ‌దువు అంతా హైద‌రాబాద్ లో కొన‌సాగింది.

బేగంపేట గీతాంజ‌లి కాలేజ్‌లో ఇంట‌ర్ చ‌దివిన నితిన్‌.. గండిపేట షాద‌న్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌లో గ్రాడ్యుయేష‌న్ చేశాడు. ఇక నితిన్ సొంత బ్యాన‌ర్ శ్రేష్ట్ మూవీస్‌లో ప‌లు సినిమాలు కూడా నిర్మిస్తాడు. అక్కినేని హీరో అఖిల్‌ను అఖిల్ సినిమాతో నితినే వెండితెర‌కు ప‌రిచ‌యం చేశాడు.

ఇక నితిన్ ఆస్తుల విష‌యానికి వ‌స్తే మ‌నోడు ఒక్కో సినిమాకు రు. 5 నుంచి రు. 7 కోట్ల వ‌ర‌కు రెమ్యునరేష‌న్ తీసుకుంటున్నాడు. రు. 60 ల‌క్ష‌ల జాగ్వార్ కారు నితిన్ వాడ‌తాడు. అలాగే రు. 75 ల‌క్ష‌ల బీఎంయూయూ ఎస్స్ 5 కారు కూడా ఇటీవ‌లే కొనుగోలు చేశాడు. ఇక 1.20 కోట్ల పోర్షే కయెన్, హోండా సీ ఆర్ వీ, ఇన్నోవా క్రిస్టా, వోక్స్ వేగన్ పాసట్ కూడా నితిన్‌కు ఉంది.

నితిన్ బైక్ విలువ రు. 17 ల‌క్ష‌లు.. జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ టెన్‌లో కోట్లు విలువ చేసే సొంత ఇళ్లు ఉంది. ఇక సొంత బ్యాన‌ర్ పై కూడా సినిమాలు తీస్తూ సంపాదిస్తున్నాడు. ఇవి కాక తండ్రి డిస్ట్రిబ్యూష‌న్‌తో పాటు ఇత‌ర వ్యాపారాలు కూడా నితిన్‌కు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news