అమ్మ..ఇలా పిలిపించుకోవడానికి చాలా మంది ఆడవాళ్ళు ఎదురుచూస్తుంటారు. అమ్మలోని గొప్పతనం అదే. కానీ కొందరికి అలా పిలిపించుకునే భాగ్యం దోరకదు. వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల కొందరు తల్లి కాలేకపోతే.. మరికొందరు ఏమో తమ అందం చెడ్డిపోతుందని.. పిల్లల్ని కనడానికి ఇష్టపడ్డరు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో హీరోయిన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయి అని ..ఇలా చాలా మంది హీరోయిన్లు పిల్లల విషయంలో సరిదిద్దుకోలేని తప్పులు చేసారు. హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న అందాల సుందరీమణులు..అమ్మ అనే పిలుపుకు దూరమైయ్యారు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!
రేవతి: ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. ఒక్కప్పుడు తన అంద చందాలతో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన ఈ సీనియర్ హీరోయిన్..తన నటనతో కుర్రకారుని ఫిదా చేసింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ ను పెళ్లి చేసుకుంది. పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుందని భావించి పిల్లల్ని కనడమే మానేసింది. అమ్మ అనే పిలుపుకు దూరమైంది.
విజయశాంతి: లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు సినిమాలోను..ఇటు రాజకీయాలోను అందరికి దడ పుట్టించే ఈ ఫైర్ బ్లాండ్ కూడా అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదు. శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్న తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ భామ.. పిల్లల్ని కనే ప్రయత్నం చేయలేదు. ఎవరైనా అడిగితే తనకు సమాజమే పిల్లలు అని అంటుందట.
శారద: టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పేషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసుకున్న ఈమె.. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి..తన నటనకు మంచి మార్కులే వేయ్యించుకుంది. కెరీర్ బాగా దూసుకుపోతున్న సమయంలోనే చలం అనే నటుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా శారద సినిమాల్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక పిల్లల గురించి ఆలోచించే టైం లేకుండాపోయింది.
జయప్రద: తన అందంతో తన నవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ స్టార్ సీనియర్ హీరోయిన్.. అతి చిన్న వయసులోనే సినిమా స్టార్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మెహతాను పెళ్లి చేసుకుంది. అయితే ఎక్కువ కాలం ఆయనతో కలిసి ఉండలేకపోయింది. ఇక పిల్లలు గురించి ఆలోచించే అవసరమే లేకుండాపోయింది..తద్వారా అమ్మ అని పిలిపించుకోలేకపోయింది.