Moviesఈయన మాత్రమే ఇలా చేయగలడు..మరోసారి తానేంటో నిరూపించుకున్న సూర్య..!!

ఈయన మాత్రమే ఇలా చేయగలడు..మరోసారి తానేంటో నిరూపించుకున్న సూర్య..!!

వర్షటైల్ యాక్టర్ అయిన సూర్య. తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరో అని అందరికి తెలిసిన విషయమే. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి గొప్ప యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో సూర్య కొద్ది కాలంలోనే మంచి హీరోగా మంచి గుర్తింపు సాధించాడు. ఆయన నటించే విభిన్నమైన సినిమాలు సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించి పెట్టాయి. కమర్షియల్ మాత్రమే కాకుండా సామజిక అంశాలను ఆయన సినిమాల్లో టచ్ చేస్తూ ఎందరో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు.

చాలామందిలాగా పబ్లిసిటీ కోసం కాకుండా చిత్తశుద్ధితో అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అంతే కాదు.. తన సినిమాల ద్వారా కూడా ఎప్పుడూ ఎంతో కొంత మంచి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో మొక్కుబడిగా కాకుండా ఏం చేసినా సిన్సియర్‌గా చేయడం సూర్య స్టయిల్. ఇప్పుడు అతను ‘జై భీమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య 40వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది.

జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు, కార్పోరేట్ శక్తులకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు. అణగారిన వర్గాలకు చెందిన ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్‌ ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది కథాంశం. వెనుకబడిన కులానికి చెందిన ఒక డ్రైవర్ అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుంటే.. చట్టం, న్యాయం గురించి ఏమీ తెలియని ఆమెకు ఓ లాయర్ అండగా నిలిచి వ్యవస్థ మీద ఎలా పోరాడాడో ఇందులో చూపించబోతున్నారు. దీని టీజర్ చూస్తే సూర్య ఒక బాధ్యతతో, ఆవేదనతో ఈ సినిమా చేశాడని స్పష్టమవుతుంది. ఈ సినిమా దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news