Moviesప్రభాస్ 'రోమాంటిక్" సర్ ప్రైజ్..అద్దిరిపోయిందిగా..!!

ప్రభాస్ ‘రోమాంటిక్” సర్ ప్రైజ్..అద్దిరిపోయిందిగా..!!

పూరీజగన్నాథ్ తనయుడిగా పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మరి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధం అయ్యాడు ఆకాష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్.

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. అనిల్ పాడూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేయడం జరిగింది.

తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ లాంఛ్ చేశాడు. ట్రైలర్‌ విషయానికొస్తే.. టైటిల్‌కి తగ్గట్టుగా రొమాంటిక్‌ సన్నివేశాలతో యువతని మెప్పించేలా ఉంది. ఆకాశ్‌ తన నటనలో పరిణితి చూపించారు. తొలి పరిచయంలోనే కేతిక అందరినీ కట్టిపడేసేలా ఉంది. రొమాంటిక్ చిత్రం ట్రైలర్ చాలా రొమాంటిక్ గా ఉండటం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో రమ్య కృష్ణ కీలక పాత్ర లో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news