Moviesఆ హీరోయిన్ క‌ష్టంపై హీరో పొగ‌డ్త‌లు మామూలుగా లేవే..!

ఆ హీరోయిన్ క‌ష్టంపై హీరో పొగ‌డ్త‌లు మామూలుగా లేవే..!

ఒక‌రికి ఒక‌రు శ్రీరామ్ ను తెలుగు ప్రేక్ష‌కులు చూసి చాలా యేళ్లు అవుతోంది. ర‌సూల్ ఎల్లోర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీరామ్ – ఆర్తీ చాబ్రియా హీరో , హీరోయిన్లుగా వ‌చ్చిన ఒక‌రికి ఒక‌రు అప్ప‌ట్లో సెన్షేష‌న‌ల్‌. ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన అడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమాలో కూడా శ్రీరామ్ న‌టించాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో అస‌లేం జ‌రిగింది సినిమాలో న‌టించాడు. జాన్స‌న్ నిర్మాత‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

తెలంగాణ‌లో జ‌రిగిన యదార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. సినిమా ట్రైల‌ర్ , ప్ర‌మోష‌న్లు, పోస్ట‌ర్లు చూస్తుంటేనే ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాపై శ్రీరామ్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. తెలంగాణ‌లోని ప‌ల్లె ల్లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా అస‌లేం జ‌రిగింది సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కంతోనే హీరో శ్రీరామ్ ప్ర‌మోష‌న్ల‌లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ ప్ర‌మోష‌న్ల‌లో శ్రీరామ్ హీరోయిన్‌ సంచిత ను ఆకాశానికి ఎత్తేశారు. సంచిత సినిమాల‌కు కొత్తే అయినా చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా కోసం ప‌ని చేసింద‌ని చెప్పారు. సంచిత‌కు భాష తెలియ‌క పోయినా కూడా ప్ర‌తి స‌న్నివేశాన్ని అర్థం చేసుకుని బెస్ట్ స్క్రీన్ ప్రెజ‌న్స్ ఇచ్చింద‌ని చెప్పారు.

ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వేడి వాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌డంతో పాటు కొన్ని సార్లు గ్యాప్ లేకుండా షూట్ చేయాల్సి రావ‌డంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని త‌ట్టుకుని మ‌రీ సంచిత సీన్ల‌లో లీన‌మై న‌టించింద‌ని చెప్పారు. కొన్ని లొకేష‌న్లు అమ్మాయిల‌కు న‌టించేందుకు ఏ మాత్రం అనువుగా లేక‌పోయినా కూడా ఆమె వాటిని త‌ట్టుకుని మ‌రి సీన్ల‌లో న‌టించింద‌ని శ్రీరామ్ మెచ్చుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news