Gossipsభరణం క్రింద అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా..?

భరణం క్రింద అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా..?

సమంత – నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారు. యస్.. అక్కినేని నాగారజున ముద్దుల కోడుకు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్ళాడిన సమంతకు విడాకులు ఇస్తున్నారు. వినడానికి బాధగా ఉన్న ఇదే నిజం. చైతూ-సమంత.. విడిపోయారు. వారి మధ్య గ్యాప్‌ ఉందని, వేర్వేరుగా ఉంటున్నారని ఇన్నాళ్లు జరిగిన ప్రచారమే నిజమైంది. ఈ మాట ఎవరో చెప్పడం కాదు..ఏదో మీడియాలో వైరల్ అవ్వడం కాదు స్వయానే వాళ్ళే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసారు. వాళ్ళ ఏడేళ్ల ప్రేమ బంధం నాలుగేళ్ల వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు చైతన్య- సమంత.

నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను తెలిపింది. దాంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రూమర్స్‌ రూమర్స్‌ అంటూ కొట్టిపడేసిన అభిమానులకు డైవర్స్ న్యూస్ విని ఫ్యాన్స్ ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఆలోచించి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు నాగచైతన్య. చైతన్య సమంత విడాకుల పై నాగార్జున స్పందించారు.. భార్య భర్తల మధ్య జరిగేది చాలా వ్యక్తిగతమైనది. నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో గుర్తుచేసుకుంటుంది.దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక అంటూ నాగార్జున పోస్ట్ చేసారు.

ఈ క్ర‌మంలో సమంత విడాకుల వెనుక కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాల గురించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. డివోర్స్ ప్రాసెస్‌లో భాగంగా స్థిర, చర ఆస్తులతో కలిపి సమంత కు భరణం కింద 250 నుండి 300 కోట్ల వ‌ర‌కు అక్కినేని ఫ్యామిలీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాలంటే చైతూ- సామ్‌ల‌లో ఒక‌రు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news