Moviesఏ సౌత్ హీరో చేయని ప్రయోగాన్ని చేస్తున్న దగ్గుబాటి వారసుడు..షాక్ అవుతున్న...

ఏ సౌత్ హీరో చేయని ప్రయోగాన్ని చేస్తున్న దగ్గుబాటి వారసుడు..షాక్ అవుతున్న ఫ్యాన్స్..!!

దగ్గుబాటి వారసుడు..టాలీవుడ్ కండల వీరుడు రానా.. బాహుబలితో తన స్టామీనా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీంలా నాయక్ అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ..పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక వైవిధ్య‌మైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ద‌గ్గుబాటి రానా తాజాగా రానా సౌత్ లో ఏ హీరో చేయనటువంటి సాహశాని చేస్తున్నట్కు తెలుస్తుంది. యస్..తాజాగా అందుతున్న సమాచారం బట్టి మనం అదే అనుకోవాలి. టాలీవుడ్ యంగ్ హీరో రానా వరుస సినిమాలు చేయడంతో పాటు పలు కంపెనీలతో కొలబ్రేట్ అవుతూ ప్రమోటర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. రానా ఎప్పుడు కూడా ఏదో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ సంస్థ లేదా ప్రాజెక్ట్ తో సంబంధాలు పెట్టుకుంటూనే ఉంటాడు. రానా కొత్తగా సోనీ లీవ్ ఓటీటీ ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్ ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో సోని ఛానల్స్ ద్వారా వ్వే తెలుగు, తమిళ్ లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళ్ లో ఈ షోని ప్రమోషన్ చేయడానికి రానా దగ్గుబాటిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్టు సమాచారం. . రానా సోనీ లీవ్ ప్రమోషన్ కోసం కమర్షియల్ యాడ్ లో నటించాడు. అందులో డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్టుగా రానా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయలేదు. మొదటి సారి రానా నుండి ఇలాంటి ప్రయోగం రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news