Moviesబిగ్ క్రేజీ అప్డేట్: అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా...

బిగ్ క్రేజీ అప్డేట్: అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్..పూర్తి డీటైల్స్ ఇవే !!

బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన మన్ డార్లింగ్.. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకునారు. ప్రస్తుతం ఈ బడా హీరో అన్నీ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో ఉండేటట్లు చూసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది.

ఇక మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది. ఇక యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న మరో సినిమా ఆదిపురుష్. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే ఈ సినిమా ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది గాక ప్రభాస్ 23వ సినిమాగా ప్రాజెక్ట్ k..అలాగే 24వ సినిమా సిద్ధార్ధ్ ఆనంద్‌తో ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన 25 సినిమా గురించిన అదికారిక ప్రకటన రావడం ప్రభాస్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. కొద్ది రోజులుగా ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్న క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అర్జున్ రెడ్డి చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ త‌న 25వ సినిమా చేయ‌నున్నాడు.


ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలతో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news