Movies“లైగర్” సినిమా రీలిజ్ లేట్ అవ్వడానికి కారణం ఆయనే..విజయ్ షాకింగ్ కామెంట్స్!!

“లైగర్” సినిమా రీలిజ్ లేట్ అవ్వడానికి కారణం ఆయనే..విజయ్ షాకింగ్ కామెంట్స్!!

విజయ్ దేవరకొండ..యంగ్ క్రేజీ హీరో. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది.. కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల ఎందుకు లేట్ అవుతుందో అనే విషయం పై క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా “లైగర్” సినిమాలో భాగమేనని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి ఆయనే కారణమట. ఈ సినిమా షూటింగ్ యుఎస్‌లో రెండు వారాల సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో దేవరకొండ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్‌తో ఫైట్ చేసే సన్నివేశాలనుషూట్ చేయాలి. అయితే కరోనా కారణంగా వీసా ప్రాసెసింగ్‌లో లేట్ అవుతుందని..త్వరలోనే ‘లైగర్’ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు విజయ్. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news