Moviesఘాటైన రొమాన్స్ తో గేట్లు ఎత్తేస్తున్న అనుపమ..వామ్మో..ఇన్ని లిప్ కిస్ లా..??

ఘాటైన రొమాన్స్ తో గేట్లు ఎత్తేస్తున్న అనుపమ..వామ్మో..ఇన్ని లిప్ కిస్ లా..??

మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెద్దగా చెప్పుకోదగ్గిన హిట్ సినిమాలు లేకపోయినా..చేసిన ప్రతి సినిమాలు వేరియేషన్స్ చూపిస్తూ..టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్లేస్ ను సంపాదించుకుంది. నితిన్ తో అ..ఆ.. నాగ చైతన్యతో చేసిన ప్రేమమ్.. శర్వానంద్ తో నటించిన శతమానం భవతి సినిమాలు మంచి కిక్కిచ్చే హిట్ సాధించాయి.

కేరళ కుట్టి అనుపమా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవాల్సిందే. చిన్న పిల్లలా మారి చేసే కొంటె చేష్టలు, తన తమ్ముడితో కలిసి చేసే అల్లరిని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. అయితే వెండి తెరపై క్యూట్‌గా కనిపించే ఈ భామ ఎప్పుడూ కూడా తన లిమిట్స్ లోనే ఉంటూ.. అందాల ఆరబోతకు అంత మొగ్గు చూపలేదు.

అయితే తాజా పరిస్ధితులు చూస్తుంటే మాత్రం అనుపమ అందాల ఆరబోతల విషయంలో గేట్లు ఎత్తేసిన్నట్లు తెలుస్తుంది. యస్.. ఈ భామా రీసెంట్ గా నటించిన చిత్రం..”రౌడీ బాయ్స్”. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..అమ్మడు ఈ సినిమా లో అన్ని హద్దులు చెరిపేసిందట. సరైన హిట్ పడడంలేదు అన్నో..లేక లిప్ లాక్ తో నైన అవకాశాలు కొట్టేదాం అన్నో తెలియదు కానీ..ఈ సినిమాలో అనుపమ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు లిప్ లాక్ లకు రెడీ అయిపోయిందట. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ చూస్తూనే ఈ పుకార్లు నిజమేనని అనిపిస్తున్నాయి. ఘాటైన రొమాన్స్ లో అను పిచ్చెక్కించదనే టాక్ నడుస్తోంది. మరి ఈ ముద్దులతో నైనా అమ్మడు ఫేట్ మారుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news