Gossipsమ‌హేష్ - రాజ‌మౌళి ప్రాజెక్టుకు మ‌రో స‌మ‌స్య‌... దిల్ రాజు ఎంట్రీ...!

మ‌హేష్ – రాజ‌మౌళి ప్రాజెక్టుకు మ‌రో స‌మ‌స్య‌… దిల్ రాజు ఎంట్రీ…!

కేవ‌లం మ‌హేష్‌బాబు అభిమానులే కాదు.. యావ‌త్ తెలుగు సినిమా అభిమానులు ఎన్నో సంవ‌త్స‌రాలుగా.. ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తోన్న సినిమా మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ – మ‌హేష్ సినిమా ఉంటుంది. ఆ త‌ర్వాత ప్రాజెక్టే మ‌హేష్ – రాజ‌మౌళిది. దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్‌. నారాయ‌ణ దీనికి నిర్మాత‌. ఆయ‌న ఎప్పుడో సింహాద్రి సినిమా టైంలో రాజ‌మౌళికి అడ్వాన్స్ ఇచ్చారు.

Mahesh Babu is off to Spain for Sarkaru Vaari Paata shoot. See pic, video  from airport - Movies News

ఆ బాకీ తీర్చేందుకే ఇప్పుడు రాజ‌మౌళి కేఎల్‌. నారాయ‌ణ‌కు సినిమా చేస్తున్నాడు. అదే టైంలో నారాయ‌ణ మ‌హేష్‌కు కూడా ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారు. అలా మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా సెట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు కొత్త స‌మ‌స్య వ‌చ్చిందంటున్నారు. రాజ‌మౌళి సినిమా అంటే కేవ‌లం తెలుగులోనో లేదా హిందీలోనో కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో క్రేజ్ వ‌చ్చేసింది.

SS Rajamouli responds to Roar of RRR's success: 'As if we released the  trailer itself' | Entertainment News,The Indian Express

ఈ లెక్క‌న ఈ సినిమాకు రు. 500 కోట్ల బ‌డ్జెట్ ఉంటుందంటున్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ జోన‌ర్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. అయితే రు. 500 కోట్ల బ‌డ్జెట్ అంటే నారాయ‌ణ‌కు క‌ష్టం. పైగా ప్రొడ‌క్ష‌న్‌, డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌హారాలు చాలా కీల‌కం. కేఎల్ నారాయణ ప్రొడక్షన్ చేసి చాలా కాలం అయింది.

Producer Dil Raju to tie the knot tonight in Nizamabad | Telugu Movie News  - Times of India

అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి దిల్ రాజును ఎంట‌ర్ చేయించే ప్లాన్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. రాజు చేతిలో ఇప్ప‌టికే శంకర్-రామ్ చరణ్, విజయ్-వంశీపైడిపల్లి లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా మ‌నోడి చేతిలో ప‌డితే రాజు పేరు నేష‌న‌ల్ లెవ‌ల్లో మార్మోగ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news