Moviesరొమాంటిక్ సినిమాపై రాజ‌మౌళి ప్ర‌శంస‌లో ఇంత వెట‌కారం ఉందా..!

రొమాంటిక్ సినిమాపై రాజ‌మౌళి ప్ర‌శంస‌లో ఇంత వెట‌కారం ఉందా..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ న‌టించిన రొమాంటిక్ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, రమాప్రభ తదితరులు న‌టించిన ఈ సినిమాకు పూరి క‌థ‌, స్క్రీన్ ప్లే ఇవ్వ‌గా, పూరి శిష్యుడు అనిల్ పాడూరి ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్‌, టీజ‌ర్లు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచాన‌లు పెరిగాయి. శుక్ర‌వారం వ‌రుడు కావ‌లెను సినిమాకు పోటీగా వ‌చ్చిన రొమాంటిక్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది.

Romantic Movie: Trailer, Release Date, Budget, Star Cast, & More -  JanBharat Times

సినిమాలో హీరోకు ప్ర‌తి సీన్లోనూ హీరోయిన్‌ను చూస్తుంటే కామం బుస‌లు కొట్టేసేలా సీన్లు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇక ఫైన‌ల్‌గా ఈ సినిమా పూరీ డై హార్ట్ ఫ్యాన్స్‌తో పాటు హీరోయిన్ అందాన్ని చూడాల‌నుకున్న వారు మాత్ర‌మే కాపాడాల‌ని కూడా కామెంట్లు ప‌డుతున్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం సెల‌బ్రిటీల‌కు ముందుగానే ప్రీమియ‌ర్ షో వేశారు.

S. S. Rajamouli: రొమాంటిక్ మూవీపై రాజమౌళి రివ్యూ.. ఆ మాట చెబితే ముసలోడని  అనుకుంటారేమో! క్రేజీ రియాక్షన్ - romantic movie premier show: rajamouli  comments on akash puri - KARKEY

ఈ సినిమా చూసిన రాజ‌మౌళి సినిమా చూశాక ఏదైనా వంక పెడ‌దాం అనుకుంటే.. ముస‌లాడివి అయిపోయావు నీకేం తెలుసు అని యూత్ అంతా ఒక్క‌టే గొడ‌వ పెడ‌తార‌న్న డౌట్ ఉంది. ద‌ర్శ‌కుడిగా ఏ సీన్ ఎలా తీస్తే అని లెక్క‌లేసుకోకుండా.. త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టు తీసేశాడు అని చెప్పాడు.

SS Rajamouli : రొమాంటిక్‌పై రాజ‌మౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్.. రెట్టింపు అయిన  అంచ‌నాలు.. - India Daily Live

అయితే ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్లు సైతం రాజ‌మౌళి సినిమా చూసి ఎలా తిట్టాలో తెలియ‌క చాలా తెలివైన సెటైర్ వేశాడ‌ని అంటున్నారు. ఏ సీన్ ఎలా తీస్తే ఏంటి అని లెక్కలేసుకోకుండా అన్న డైలాగ్లో ప్ర‌శంస‌లాగా క‌నిపించే సెటైర్ ఉంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రాజ‌మౌళి మాట‌లు కోట్ చేస్తూ రొమాంటిక్‌ను ఆడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news