Moviesబిగ్ బాస్ లో అరగంటకు అన్ని లక్షలా.. ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే...

బిగ్ బాస్ లో అరగంటకు అన్ని లక్షలా.. ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

హైపర్‌ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్‌ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు… చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్‌ మీనింగ్‌ పంచ్‌లు మాములుగా ఉండవు.

ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు. కాగా నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి హైపర్ ఆది గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు. తెలుగులో అతి పెద్ద రియాలిటి షో అయినా బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది.. హోస్ట్ అక్కినేని నాగార్జునతో మొదలుకొని..మొత్తం హౌస్ లో ఉన్న అందరూ కంటెస్టెంట్ ల పై తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ నవ్విస్తూ అందరిని అలరించాడు.

అయితే అరగంట పాటు వేదికపై సందడి చేసిన హైపర్ ఆదికి బిగ్ బాస్ ఎంతో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక లీక్ అవుతున్న సమాచారం ఆధారంగా..బిగ్ బాస్ లో మొదటిసారి ఒక అవకాశం అందుకున్న హైపర్ ఆది కి స్టార్ మా షో మొదలైనప్పుడే అతనికి అడ్వాన్స్ ఇచ్చి షోను ఫాలో అవ్వమని చెప్పారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక మొదట అరగంట పాటు కనిపించాల్సి వస్తుందని కమిట్మెంట్ తీసుకొని..బిగ్ బాస్ మెనేజ్మేంట్ 2.50లక్షలకు పైగా పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి హైపర్ ఆది వెళతాడు అని అందరు అనుకున్నారు..కానీ చివరి నిమిషంలో ఆయన వెళ్లలేదట. నెక్స్ట్ సీజన్ కి అయినా హైపర్ ఆది బిగ్ బాస్ హౌస్ లోకి వెళతాడు ఏమో చూడాలి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news