Moviesమెగా హీరో తో స‌మంత‌ ‘లిప్ లాక్‌’ వెనుక ఇంత కధ...

మెగా హీరో తో స‌మంత‌ ‘లిప్ లాక్‌’ వెనుక ఇంత కధ నడిచిందా..??

మెగా పవర్ స్టార్ రాం చరణ్..అక్కినేని కోడలు పిల్ల సమంత ఇద్దరు కలసి జంటగా నటించిన చిత్రం “రంగ‌స్థ‌లం”. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే రంగ‌స్థ‌లం సినిమా బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఆ సినిమా కు ముందు వ‌ర‌కు కెరీర్ ప‌రంగా రామ్ చ‌ర‌న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రామ్ చ‌ర‌ణ్‌కు న‌ట‌న కూడా రాద‌ని విమ‌ర్శ‌లు చేసిన వాళ్లు సైతం ఆ సినిమాలో న‌ట‌న చూశాక మైంబ్ బ్లాక్ అయ్యి వాళ్ల నోట మాట కూడా రాలేదు.

అప్పట్లొ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ రంగ‌స్థ‌లం సినిమాల రికార్డుల‌కు ర‌ణ‌స్థ‌లంగా మారిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ పాత రికార్డుల‌కు పాత‌రేస్తూ దూసుకుపోయింది. ఫ‌స్ట్ వీక్‌లోనే ఎన్నో రికార్డుల‌ను తుడిచి పెట్టేసి.. సరికొత్త రికర్డ్ లు క్రీయేట్ చేసింది రంగ‌స్థ‌లం మూవీ. అయితే ఈ సినిమాకి సమంత నటన మంచి ప్లస్ పాయింట్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా..ఈ సినిమాలో చరణ్ సమంత లిప్ లాక్ సీన్ టోటల్ సినిమాకే హైలెత్ సీన్ గా నిలిచింది.

నిజానికి సుకుమార్ చ‌ర‌ణ్‌కి స్క్రిప్టు చెప్పిన‌ప్పుడే ఈ లిప్ లాక్ సీన్ గురించి చెప్పితే.. చ‌ర‌ణ్ వద్దన్నాడట. ఎందుకంటే..అప్పటికే చరణ్ కి పెళ్ల‌యిపోయింది. పైగా. ఉపాస‌న‌కు ఇలాంటివి నచ్చవు అని ఖ‌రాఖండీగా చెప్పేశాడ‌ట‌. దానికి సుకుమార్ కూడా ‘స‌రే’ అన్నాడట‌. కానీ… సీన్ షూట్ చేసే రోజువ‌చ్చినప్పుడు.. “చ‌ర‌ణ్ కి లిప్ లాక్ పెట్టు..” అని స‌మంత‌కి చెప్పేసి.. చ‌ర‌ణ్ కి మాత్రం పెదాలు ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయి అంతే ఆ తరువాత మ‌నం గ్రాఫిక్స్ లో చూసుకుమదాం అని చెప్పాడట.

ఇక షూట్ కి రెడీ చేసి.. సుకుమార్ యాక్ష‌న్ అని చెప్ప‌గానే.. స‌మంత నేరుగా వెళ్లి లిప్ లాక్ ఇచ్చేసింద‌ట‌. దీంతో ఒక్కసారిగా చరణ్ షాక్ అయ్యాడట. సుకుమార్ మోసం చేసాడని చరణ్ అలిగి మూడు రోజులు షూటింగ్ కి కూడా పోలేదట. కానీ.. ఆ తరువాత మెగాస్టార్ ఎంటర్ అయ్యి..కూల్ చేసి సుకుమార్ తో మాట్లాడి ..చ‌ర‌ణ్ కి అర్థ‌మ‌య్యేలా చెప్పి క‌న్వెన్స్ చేశాడ‌ట‌. మొత్తానికి లిప్ లాక్ సీన్‌.. హైలెట్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news