Moviesహమ్మయ్య..ఎట్టకేలకు ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పిన అఖిల్..క్లారిటీ వచ్చేసిందోచ్..!!

హమ్మయ్య..ఎట్టకేలకు ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పిన అఖిల్..క్లారిటీ వచ్చేసిందోచ్..!!

అక్కినేని వారసుడు అఖిల్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కలమే అయినా.. కానీ, ఈ అఖిల్కి ఇంతవరకు ఒక్క హిట్టు కూడా పడకపోవడం గమనార్హం. ఎప్పుడు రొటీన్ కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకొని హిట్ కొట్టే నాగార్జునకు ఆయన కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ పైకి మరోసారి దండయాత్రకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా వస్తున్నాడు అఖిల్ అక్కినేని.

‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడెప్పుడో విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ మంచి పాజిటివ్ టాక్ ను ఒంటం చేసుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్తుకున్నారు మేకర్స్.


వరస ఫ్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ను నమ్మి నాగార్జున, అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ఇచ్చారంటే సినిమాలో ఎంత దమ్ము ఉందో అని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సింది..కానీ మాయదారి కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేసారు మేకర. అక్టోబర్​ 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ సందర్భంగా అఖిల్​కు సంబంధించిన డిఫరెంట్​ లుక్స్​ను ఒకే ఫ్రేమ్​లో జోడించి పోస్టర్​ను పోస్ట్​ చేసింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news