Gossipsభర్త కోసం ముందడుగు వేసిన ఉపాసన..రామ్ చరణ్ ఫుల్ ఖుషీ..?

భర్త కోసం ముందడుగు వేసిన ఉపాసన..రామ్ చరణ్ ఫుల్ ఖుషీ..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్..సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతాను అనే స్టైల్ లో ..గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరో ల లిస్ట్ లో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు.

ఇక RRR మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టు ఓకే చేసిన సంగతి తెలిసిందే. భారీ బడా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువటి కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దీంతో రామ్ చరణ్- శంకర్ కాంబో అని తెలియగానే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.

ఈ సినిమాకి రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని బాధ్యతలు తీసుకోవడానికి ముందు అడుగు వేసిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన పనుల విషయంలో.. ముఖ్యంగా చరణ్ కు రిలేటెడ్ అయినా ప్రతి మ్యాటర్ లో ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. చరణ్ కి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఉపాసన కూడా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు పాటిస్తోందట.

ఇక ఈ విషయమై చరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ కథలో రామ్ చరణ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news