Moviesమీరు చేస్తే మాత్రం నీతి.. నేను చేస్తే మాత్రం బూతా..? సిద్దార్థ్...

మీరు చేస్తే మాత్రం నీతి.. నేను చేస్తే మాత్రం బూతా..? సిద్దార్థ్ ఘాటుగా ప్రశ్నలు..!!

ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఫ్యామిలీ హీరో శర్వానంద్.. టాలెంటెడ్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మహా సముద్రం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్, టీజర్స్ మహాసముద్రం మూవీపై భారీ అంచనాలు పెట్టుకునేలా చేసాయి. భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను ..మహా సముద్రం ట్రైలర్‏ను విడుదల చేశారు.

సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ సాగే ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో శర్వానంద్, సిద్దార్థ్ అదరగొట్టేశారనే చెప్పాలి. మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా? అంటూ జగపతి బాబును సిద్దార్థ్ నిలదీసే సీన్ సినిమా పై మరింత అంచనాలు పెరిగేలా చేసాయి. ఇక శర్వానంద్ చేసే యాక్షన్, ఎమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు అభిమానులు. మొత్తంగా మహా సముద్రం ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుందనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news