అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు నాగచైతన్య. నిజానికి ఏం మాయ చేసావే సినిమా తరువాత నాగ చైతన్య కు ఇప్పటి వరకు ఆ రెంఝ్ హిట్ పడలేదు. మధ్య 100% లవ్ సినిమా చేసిన ..ఆ సినిమా భారీ విజయాని సాధించిన.. ఆ తరువాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో..చైతన్య టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ చేరలేకపోయాడు.
ఇక నాగ చైతన్య ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి..సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం “లవ్ స్టోరి”. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి. నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ఇతర అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు చిత్ర యూనిట్.
ముఖ్యంగా తెలంగాణ యాసలో చైతు డైలాగ్ డెలివరీ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపొయారు. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతు మాట్లాడుతూ… “లవ్ స్టోరీ” సినిమాలో నేను బాగా యాక్ట్ చేసాను..నా నటన బాగుంది అంటే దానికి కారణం సాయి పల్లవి. కచ్చితంగా అందులో సగం క్రెడిట్ సాయి పల్లవి, ఈశ్వరీ రావు గారు ,శేఖర్ కమ్ముల గారికి ఇస్తాను. ‘లవ్ స్టోరీ’ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటాయి. తప్పకుండా సినిమా మిమ్మల్నందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.