Moviesగుడ్ న్యూస్ చెప్పిన శర్వానంద్ ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడోచ్..!!

గుడ్ న్యూస్ చెప్పిన శర్వానంద్ ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడోచ్..!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో నటన పరంగా స్టార్ హీరోల కి ఏమాత్రం తీసి పోని నటన తో మెప్పించే యాక్టర్ శర్వానంద్. శర్వానంద్ విలక్షణ కథానాయకుడు. స్టార్ అనడం కన్నా అద్భుతమైన నటుడు, సూపర్ పెర్ఫార్మెర్ అని అంటే సరిగ్గా అతనికి సెట్ అవుతుంది. ఎందుకంటే శర్వానంద్ కెరియర్ ను గమనిస్తే అందులో కథాబలం, లేదా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలే ఎక్కువగా ఉంటాయి.

‘మహానుభావుడు’, ‘శతమానం భవతి’, ‘జాను’ వంటి కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రాలు చేస్తూ..ఫ్యామిలీ ఆడియెన్స్ తోపాటు, యుత్ ఆడియెన్స్‌లో మంచి ఇమేజ్ సంపాదించాడు శర్వానంద్. దాంతో పాటు రన్ రాజా రన్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలు చేసి మెప్పించాడు. శతమానం భవతి సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇయర్ ఎండ్ లో మహానుభావుడు తో మరో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న శర్వానంద్ తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్నాడు, పడి పడి లేచే మనసు, రణ రంగం, జాను…ఇక ఈ ఇయర్ శ్రీకారం లాంటి సినిమాలు ఆడియన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.

రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ పడ్డా కానీ ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా మహా సముద్రం హిట్ అవుతుమదనే ఆశలు పెట్టుకున్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అయిన “మహా సముద్రంపై” ఈ హీరో ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత శర్వా హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఓ ప్రాజెక్ట్ చేతిలో ఉన్న టైంలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు శ్ర్వా. కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు శర్వానంద్ ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. రాజు సుందరం, శర్వానంద్ గత కొన్ని సంవత్సరాలుగా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ టైం వచ్చిన్నట్లు తెలుస్తుంది.

Latest news