Gossipsతన కొంప తానే ముంచుకుంటున్న సమంత...?

తన కొంప తానే ముంచుకుంటున్న సమంత…?

సినీ ఇండస్ట్రీలో ఏదైన ఓ సినిమా సూపర్‌ హిట్‌ అయితే ఇతర భాషలో రీమేక్‌ అవ్వడం సర్వసాధారణం. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలను ఎన్నో బాషల్లో రీమేక్ చేసారు. ఒక మంచి సినిమా ను ఒక భాష నుండి మరో భాష కి సంభందించిన ఆడియన్స్ కి అందించాలి కాబట్టి రీమేక్స్ విషయం లో ఎలాంటి తప్పు లేదు కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తారంగా వ్యాప్తి చెంది ఉన్న టైం లో అందరూ అన్ని భాషల సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేస్తూ సినిమా కి భాషతో సంభందం లేదు అని నిరూపిస్తున్న వేల ఇంకా రీమేక్లు చేయడం చాలా కష్టతరం అనే చెప్పాలి.

అయితే గత కొంత కాలంగా సౌత్ హిట్ సినిమాలతో పాటుగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు పై బాలీవుడ్ కన్నేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలను రీమేక్ చేసిన బాలీవుడ్ తాజాగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘96’ చిత్రం కూడా బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతుంది. యస్..విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అక్కడ ఎంత భారీ విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ఇదే సినిమాని నిర్మాత దిల్ రాజు తెలుగులోకి ‘జాను’ అనే టైటిల్ తో .. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే తమిళంలో ఆశించినంతగా తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. పక్కాగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారట. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ప్రకటించారు. త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతనే తీసుకోనున్నారట. ఇప్పటికే హీందీలో రెండూ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి సమంత బాలీవుడ్ లో ఎలా నెట్టుకొస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news