Moviesభారీ రేటుకు అమ్ముడైన ‘కార్తికేయ 2’ రైట్స్..ఎంతో తెలిస్తే కళ్లు జిగేల్..!!

భారీ రేటుకు అమ్ముడైన ‘కార్తికేయ 2’ రైట్స్..ఎంతో తెలిస్తే కళ్లు జిగేల్..!!

యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరనే హీరోయిన్‌గా నటిస్తుంది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా. విభిన్నమైన కథ కథనాలతో తెరకెక్కిన కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు అలాంటి కథ తోనే కార్తికేయ 2 కూడా తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఇక ఈ సినిమా షూటింగ్ కు ఈ నెల చివరిలో గుమ్మడికాయ కొట్టనున్నారు చిత్రయూనిట్.

ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మొదటి పార్ట్ కంటే కార్తికేయ 2 మరింత ఇంట్రెస్టింగ్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కార్తికేయలో హీరోయిన్‌గా నటించిన స్వాతి.. ఇప్పుడు కార్తికేయ 2లో కీలక పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట.

కార్తికేయ‌-2 మూవీ రైట్స్ హాట్ కేకులా అమ్ముడైపోయాయి. కార్తికేయ‌-2 ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని క‌లిపి 20కోట్ల ధ‌ర ప‌లికింది. అయితే నిఖిల్ చిత్రానికి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఆధ్యాత్మిక అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై వారు చాలా నమ్మకంగా ఉండటంతో అడ్వాన్స్ కూడా ముట్టచెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోండగా.. కాల బైర‌వ మ్యూజిక్ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news