Moviesపవన్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

పవన్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.సామాన్యుల దగ్గర నుండి టాప్ సెలబ్రిటీల వరకు ఆయనకు విషేస్ చెప్పుతూ..మెసేజస్ ట్వీట్స్ చేసారు. ఇక ఆయన ప్రస్తుత సినిమాలు..రాబోయే సినిమాల గురించిన అప్డేట్స్ తో టాలీవుడ్ మొత్తం ఓ పండగ వాతావరణం నెలకొనింది. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.. అభిమానుల ట్వీట్స్ తో ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ మోత మోగింది.

మొదట పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ నుండి “భీం భీం భీం భీం భీమ్లానాయక్… దంచి దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…” అంటూ సాగుతున్న ఓ అద్దిరిపోయే సాంగ్ ను పవన్ బర్త డే సంధర్భంగా రిలీజ్ చేసారు. ఆ తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలొ నటిస్తున్న “హరిహర వీరమల్లు” రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఇక ఆ తరువాత పవర్ ఫుల్ కాంబినేష హారిష్ శంకర్ తో ..పవన్ కళ్యాణ్ ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.

ఇందులో పవర్​స్టార్​ బండిమీద కూర్చొని చేతిలో మైక్​ పట్టుకుని ఉన్నారు. అయితే పవన్​ మొహాన్ని పూర్తిగా చూపించలేదు. ఈ పోస్టర్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కాగా, ఇది కాస్త ఫ్యాన్స్ ను నిరుత్సహపరిచింది. హరీష్ శంకర్ సినిమాలోని పవన్ ప్రీ లుక్ వచ్చిన.. ఇందులో పవన్ కళ్యాణ్‌ ను మొత్తంగా చూపించకుండా సగమే చూపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణి మొత్తం చూయించుంటే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలాంటిదో ఒక అంచనా వేసుమేవారు..పోస్టర్ కి ఇంకా హైప్ ఉండేది..కానీ, అలా జరగలేదు. దీంతొ పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

Latest news