Gossipsరావడం రావడమే ఓ రేంజ్ లో చేస్తున్నాడుగా..మామూలోడుకాదండోయ్..!!

రావడం రావడమే ఓ రేంజ్ లో చేస్తున్నాడుగా..మామూలోడుకాదండోయ్..!!

హీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్.. పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టపడ్డాలి.. క్రమశిక్షణ ఉండాలి అని నిరూపించాడు హీరో ధనుష్. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన ధనుష్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగి ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. సొంతంగానే తన నటన టాలెంట్ ఉపయోగించి ప్రతి సినిమాకు మంచి క్రేజ్ ను పెంచుకుంటూపోతున్నాడు.

ఉత్తమ నటుడిగా 2 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుష్ నటనా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పలు అద్భుతమైన చిత్రాలతో భారత దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు.. బాలీవుడ్‌లోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. అయితే ఇప్పటివరకూ ఆయన నేరుగా తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ, త్వరలోనే నేరుగా తెలుగులో సినిమా చేయనున్నారు.

ధనుష్.. శేఖర్ కమ్ములతో సినిమా కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఈ సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సోషల్‌మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ధనుష్ తొలి తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news