Moviesకామెడీతో చంపేసిన "అనుభవించు రాజా" టీజర్..రాజ్ తరుణ్ డైలాగ్స్ మామూలుగా...

కామెడీతో చంపేసిన “అనుభవించు రాజా” టీజర్..రాజ్ తరుణ్ డైలాగ్స్ మామూలుగా లేవుగా..!!

టాలీవుడ్ లోకి ఉయ్యాల-జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ తర్వాత నటించిన సినిమా చూసిస్త మావా, కుమారి 21 ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు సినిమాలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. యువ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటి ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. రాజ్ తరుణ్ కెరియర్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ కొనసాగిస్తున్నాడు.

కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్.. మరోసారి తన లక్ ను పరీక్షించుకోడానికి.. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రంతో మనముందుకు వస్తున్నాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తీసిన శ్రీనివాస్ గవిరెడ్డితో “అనుభవించు రాజా” అనే పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కషీప్‌ఖాన్‌ నటిస్తోంది. ఇక ఈ చిత్రాని సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం టీజర్ ను ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసారు. టైటిల్ కు తగ్గట్లుగానే రాజ్ తరుణ్ ఇందులో జల్సా రాయుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తుంది. విడుదలైన టీజర్ బట్టి చూస్తే కోళ్ల పందాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అర్ధమవుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కామెడీ తో మనలని ఎంటర్టైన్ చేస్తారని అర్ధమౌతుంది. మరీ ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇక రాజ్ తరుణ్ కోనసీమ స్లాంగ్ లో అదరగొట్టేసాడనే చెప్పాలి. మొత్తానికి రాజ్ తరుణ్ ఈ టీజర్ తో పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించ గలిగాడు. అంతేకాదు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, ఆడుకళం నరేన్, అజయ్, రవి కృష్ణ, సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ కొడతాడో లేదో అనే విషయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news