Moviesఅక్కినేని నాగార్జున కీలక నిర్ణయం.. పెద్ద తలనొప్పి వచ్చిపడిందే..?

అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం.. పెద్ద తలనొప్పి వచ్చిపడిందే..?

కింగ్ నాగార్జున కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా ఉన్నారు నాగ్. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతోప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్. ఇప్పుడు బంగార్రాజుగా రావడానికి సిద్ధమయ్యారు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ రూపొందుతోంది.

ఈ సినిమాకి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ను రీసెంట్ గా ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన నాగార్జున పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు దర్శక నిర్మాతలు కాజల్ స్థానంలో మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట. గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ గర్భవతి అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది గౌతమ్ కిచ్లు తో వివాహం చేసుకున్న కాజల్ ఇప్పుడు తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుందని తెలుస్తోంది.

అందుకే కాజల్ స్థానంలో ఇప్పుడు మరొక హీరోయిన్ ని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్‌లోకి గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలియానా చివరిగా టాలీవుడ్లో చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరి చూడాలి నాగ్ పక్కన ఇలియానా ఎలా ఉంటుందో.. ఈ సినిమాతో అయిన ఆమె టాలీవుడ్ లో మచి అవకాశాలు కొట్టేస్తుందో అనేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news