Moviesరవి తేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే.. ఎంత...

రవి తేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..??

ఒకప్పుడు మాస్ మహారాజ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఈలలు,గోలలు..మాస్ స్టెప్ లు వేసుకుంటూ హాళ్ళవైపు పరుగులుపెట్టేవారు. స్క్రీన్ మీద రవితేజ హీరోయిజం తో కూడిన అల్లరి అందరిని ఫిదా చేసేది. కమెడియన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన రవితేజా కెరియర్ టాప్ హీరో రేంజ్ కి రాకెట్ లా దూసుకుపోయింది. అయితే…. ఎంత వేగంగా దూసుకుపోయిందో..అంతే స్పీడ్ గా ఇప్పుడు ఆ రాకెట్ అంతే స్థాయిలో కిందికి దూసుకు వచ్చేసింది. గత కొంత కాలంగా రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.

ఇలా వరుసగా ప్లాప్ లు పలకరించడంతో రవితేజ తో సినిమా అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా వచ్చిన “క్రాక్”సినిమాతో మళ్లీ ఫాం లోకి వచ్చాడు రవి తేజ. అయితే రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖిలాడి. ఈ సినిమా కోసం అభిమానులు ఎఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రవితేజను మళ్లి టాప్ హీరోల లిస్ట్ లో చేర్చుతుందని అందరు అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాని భారీ బడ్జేట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సుమారు 65 కోట్ల బడ్జెట్ తో రవితేజ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న . ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండడంతో ఈ సినిమా మ్యూజికల్ హిట్ పక్కా అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. మరి చూడాలి రవితేజకు ఈ సినిమా ఎంత మంచి పేరు తీసుకువస్తుందో..!!

Latest news