Moviesచెల్లిలి కాపురం "పౌర్ణ‌మి" ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..అసలు నమ్మలేరు..!!

చెల్లిలి కాపురం “పౌర్ణ‌మి” ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..అసలు నమ్మలేరు..!!

బుల్లితెర మీద సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే అన్ని సీరియల్స్ బాగా టీఆర్పీస్ తెచ్చుకుంటున్నాయి.. ధారావాహికంగా నడుస్తున్నాయి. ట్వ్ సీరియల్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ బాగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

మాటీవీ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు, కార్తీకదీపం, చెల్లెలి కాపురం సీరియల్స్‌ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా చెల్లెలి కాపురం సీరియల్ కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. అందుకే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది.

కార్తీకదీపంలో వంట‌ల‌క్క ఎంత పాపులర్ అయిందో చెల్లెలి కాపురం సీరియల్ నటి పౌర్ణమి సైతం తన అందం… అభినయంతో ప్రేక్షకుల మనసును దోచి వేసింది. ఆమె వ్యక్తిగత విషయానికివస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన ఈ పౌర్ణమి అసలు పేరు జయ హారిక.తండ్రి ఉద్యోగ రీత్యా పంజాబ్ వెళ్లడంతో అక్కడే ఐదో తరగతి వరకు చదువుకున్న ఆమె… ఆ తర్వాత కుటుంబం కాకినాడ తిరిగి రావడంతో అక్కడ ఎనిమిదవ తరగతి వరకు చదివింది. 17 సంవ‌త్సారాల‌కే బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె పుసుపు కుంకుమ‌, మేఘ‌మాల‌, వ‌రూనిధి ప‌రిచ‌యం, శ్రావ‌ణ స‌మీరాలు, రుతుగీతం, అత్త‌మొగుడు, నేను శైల‌జ వంటి సీరియ‌ల్స్‌లో న‌టించింది. ఆమెకు పానీపూరి, చికెన్ అంటే చాలా ఇష్టం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news