Gossipsహీరోకు ధీటుగా రావు రమేష్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..?

హీరోకు ధీటుగా రావు రమేష్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..?

రావు రమేష్.. ఈ పేరు మనకు కొత్తది ఏమి కాదు.సో..పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి.. తన స్టైల్ తో .. తన యాక్టింగ్ తో.. మనల్ని మెప్పించి.. ఎంతో మంది ప్రేక్షకులని కడుప్పుబ్బ నవ్వించిన రావు రమేష్ గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం.

సినీ ఇండస్ట్రీల నట వారసులుగా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతమంది హీరోలు తమ కొడుకులని సినిమాల్లోకి ఎంట్రీ ఎక్కువగా ఇప్పిస్తారు. ఆ విధంగానే ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినా రావు రమేష్.. నటుడిగానే గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, కొత్త బంగారు లోకం,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’ వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న న‌టుడు రావు ర‌మేష్‌. ఏ పాత్ర‌లోనైన ఇట్టే ఒదిగిపోయి న‌టించే ఆయ‌న‌కు ఆఫ‌ర్స్ కోకొల్ల‌లుగా వ‌స్తుంటాయి. ప్ర‌తి పాత్ర‌లో ఇట్టే ఒదిగిపోయే త‌త్వం రావు ర‌మేష్ సొంతం. కొన్ని సినిమాలు రావు ర‌మేష్ కోస‌మే చూడాలి అనేలా ఉంటాయి. ఇక ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఈయన బిజీగా ఉన్నారు. తమిళం నుంచి “నాయట్టు”సినిమాని, తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాలో రావు రమేష్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ అడిగారట. ఇందుకు గాను ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఓ మాదిరి చిన్న హీరోలకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాంటిది క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఇంత పెద్ద మొత్తం అంటే ఎక్కువే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news