Moviesపుష్ప టీం మైండ్ బ్లోయింగ్ డెసిషన్ .. లీకు రాయళ్లుకు దిమ్మతిరిగే...

పుష్ప టీం మైండ్ బ్లోయింగ్ డెసిషన్ .. లీకు రాయళ్లుకు దిమ్మతిరిగే షాక్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. బ‌న్నీ – సుకుమార్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న పుష్ప‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నం.. పుష్ప సినిమా సీన్స్,ఫైట్స్, సాంగ్స్ లీక్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దీంతో నెట్టింట పుష్ప హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో #PUSHPA LEAKED అనే హ్యాష్ ట్యాగ్ మీద కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ లీకులపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. శ్రీవల్లి అనే పాట మొత్తం లీకైందని అంటున్నారు. ఇప్పుడు సినిమా యూనిట్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఈ లింకులను ఎవరు చేస్తున్నారు ..అనే విషయంపై నిర్మాతలు తలపట్టుకుంటున్నారు.

ఇప్పటికే ఈ విషయం మీద సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ అయ్యి .. ఇలాంటి లీకేజీ రాయుళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలా హెచ్చరించిన కొద్ది సేపటికి మరో వీడియో లీక్ కావడంతో..ఇక బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇకపై ఎవ్వరూ కూడా సెట్‌లో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో గానీ ఫోన్లు వాడొద్దని హెచ్చరించారట.

అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇలాంటివి మరొకసారి చేస్తే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ వీడియోను రష్మిక మందన్న సోషల్ మీడియాలో షేర్ చేసి .. ఇలాంటివి ఇంకోసారి చేయొద్దండి ప్లీజ్ అంటూ వెడుకుంటుంది .

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news