Gossipsమెగా మేనల్లుడికి బాగా ముదిరిపోయింది.. మరి ఇంతలానా..??

మెగా మేనల్లుడికి బాగా ముదిరిపోయింది.. మరి ఇంతలానా..??

మెగా కాంపౌండ్‌ నుండి వచ్చిన అరడజన్ హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు మంచి గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు వీరి అడుగుజాడల్లోనే మరో మెగా హీరో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన తొలి చిత్రం “ఉప్పెన”.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన‌ బాక్సాఫీస్ దగ్గర వ‌సూళ్ల‌ వర్షం కురిపించింది. వైష్ణవ్ కి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికి .. తన పర్ఫామెన్స్ మాత్రం వేరే లేవల్ లో ఉంది. కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీ రోల్ పోషించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12 న రిలీజ్ అయ్యి రు. 50 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టింది. ఓ డెబ్యూ హీరో మూవీ ఈ రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ అంటే పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో తనకంటు ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో వైష్ణవ్‌ క్రేజ్‌ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం వైష్ణవ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘కొండపొలం’ అనే ప్రయోగాత్మక చిత్రం తో పాటు మరో సినిమాని కూడా లైన్‌లో వెట్టాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమాను సైన్ చేశాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ..ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది.

కేతికా శర్మ ..మరో హీరోయిన్‌ శోభితా రానా ఈ సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో శోభితా రానా హీరోయిన్ గా వద్దు..వేరే అమ్మాయిని ట్రై చేద్దాం అంటున్నారట వైష్ణవ్. అంతేకాదు ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో మెరవడానికి వైష్ణవ్ కి జబర్ధస్త్ యాంకర్ అనసూయ కావాలని అంటున్నారట. అనసూయ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఒక్క సినిమా హిట్ అవ్వగానే ఈ మెగా హీరో ఆ హీరోయిన్ వద్దు.. ఈ హీరోయిన్ నే కావాలి అనడం ఏమాత్రం హీరో లక్షణాలు కావు అంటూ ఫిలిమ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news