Moviesనాగ్ కెరీర్ లోనే ఫస్ టైం అలా..ఆ ఒక్క సినిమా కోసం...

నాగ్ కెరీర్ లోనే ఫస్ టైం అలా..ఆ ఒక్క సినిమా కోసం ఏం చేసాడొ తెలుసా..??

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. టాలీవుడ్ లో లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా వెండితెరకు పరిచయమైన నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ఎన్నో పాత్రలతో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారు.

 

విక్రమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగార్జున. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. అంతేకాదు.. నాగార్జున తన తండ్రి నాగేశ్వర్ రావుతో కలిసి పలు సినిమాలో నటించారు. ఇప్పుడు నాగార్జున తన కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. ఇంత వయసు వచ్చినా కూడా నాగారజున అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మనవళ్ళు-మనవరాళ్లు వచ్చే వయసు ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఇప్పటికి మన్మధుడిగా రాణిస్తున్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.

అయితే నాగార్జున కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.అందులో కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే సంతోసహ్మ్ . ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు దశరథ్.. కేవలం 20 నిమిషాల చిన్న లైన్‌ను మాత్రమే నాగార్జునకు వినిపించాడ‌ట‌. ఆ చిన్న లైన్ తోనే ఇంప్రెస్ అయిపోయిన నాగ్.. ఈ కథ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని దశరథ్‌ ని అడిగితే.. అతను కచ్చితంగా ఆరు నెల‌లు ప‌డుతుంద‌ని చెప్పాడ‌ట‌. అంతే ఓకే డన్ ..నేను ఆరు నెలలు వెయిట్ చేస్తాను అని చెప్పాడట చెప్పిన్నట్లే ఆ సినిమా కోసం వెయిట్ చేసాడు.. ఈ బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news