Moviesనవదీప్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..??

నవదీప్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..??

నవదీప్..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. తేజ దర్శకత్వం లో వచ్చిన “జై” సినిమాతో పరిచయమైనా నవదీప్ ఇప్పుడు సహనటుడిగా స్థిర పడిపోయాడు టాలీవుడ్ లో . బిగ్ బాస్ షో తో ఫేమస్ అయ్యి మెయిన్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ పిల్లి కళ్ళ హీరో. హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్న నవదీప్ సైడ్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి నటుడుగా బాగా గుర్తింపు పొందాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. విషయానికొస్తే.. క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవదీప్. హీరోగా నటించిన సినిమాల కన్నా కూడా క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన సినిమాలే మంచి మార్కులను కొట్టేశాయి.

అయితే నవదీప్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 16 సంవత్సరాలు అవుతుంది. నవదీప్ ఎన్నో సినిమాలలో నటించిన హిట్ అయ్యయి..కానీ బ్లాక్ బస్టర్ హిట్ గా ఏ ఒక్క సినిమా కూడా నవదీప్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఒకటో రెండో సినిమాలు తప్ప మరే సినిమాలు కూడా అంతగా ఆడలేదు అని చెప్పవచ్చు.

అయితే ఒకప్పుడు నవదీప్ GAY అనే పుకార్లు కొంతమంది పుట్టించారని చెప్తూ నవదీప్ ఎమోషనల్ ఎమోషనల్ అయ్యారు. ఆ వార్తలు చూసి తనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడిన మాటలు ఇప్పటికి తనకి గుర్తు ఉన్నాయని చేపుతూ.. “మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టమట కదా మీతో కొంచెం మాట్లాడొచ్చా” అని అడిగాడట..దీంతో తనకు భరించలేనంత కోపం వచ్చినా..ఆ కోపాన్ని తగ్గించుకుని.. కూల్ గా ఫోన్ కట్ చేసి పక్క పడేశాడట. కేవలం సినిమా కోసమే అలాంటి గెటప్పులు వేయవలసివచ్చింది అని నవదీప్ క్లారిటీ ఇచ్చారు. ఇక అలాంటి పాత్రలు వేయడం వల్లే నవదీప్ కెరీర్ నాశనం అయ్యిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news