Moviesహీరో కార్తికేయ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా..ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే..అసలు...

హీరో కార్తికేయ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా..ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే..అసలు నమ్మలేరు..?

యంగ్ హీరో కార్తికేయ.. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి..టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పేషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది.

ఇక ఈయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో కార్తికేయ ఎంగేజ్‌మెంట్ మ్యాటర్ బయటపడింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కార్తికేయ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్‌లో ఆయన నిశ్చితార్ధం జరగ్గా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో కార్తికేయకు కాబోయే భార్య ఎవరన్నది తెలుసుకునేందుకు అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో కార్తికేయ తనకు కాబోయే భార్య గురుంచి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇక ఆ అమ్మాయి కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని వందల కోట్ల ఆస్తులు ఉన్న సంపన్నుల వారసురాలని టాక్ వినిపిస్తున్న క్రమంలో హీరో కార్తీకేయ భార్య గురించి రివీల్ చేసాడు. “2010లోనే మొదటి సారి ఆమెను వరంగల్ నిట్‌లో చూశాను అని, ఆమె పేరు లోహిత అని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది” అంటూ హీరో కార్తికేయ అభిమానులతో శుభవార్తను పంచుకున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news