MoviesCongratulations అంటూ ట్వీట్స్..సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!!

Congratulations అంటూ ట్వీట్స్..సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!!

సమంత అక్కినేని తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ప్రస్తుతం సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ 2 సీరిస్‌లో.. సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

రాజీ పాత్రలో ఆమె నటన దాదాపు అందరికీ నచ్చేసింది. రాజీ పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. దీంతో ప్రేక్షకుల నుంచే కాక సహ నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్‌, డీ గ్లామర్ లుక్‌లో సమంత అక్కినేని తన పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది.

అయితే తాజాగా సమంతకు ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌కు సంబంధించి ఓ అరుదైన గుర్తింపు లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్‌బోర్న్‌-2021లో ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఈ విషయాన్ని ‘ఐఎఫ్ఎఫ్‌‌మ్’ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. సమంతతో పాటు ఈ సిరీస్‌లో హీరోగా నటించిన మనోజ్‌ భాజ్‌పేయ్‌కి కూడా ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఇక దీంతో సమంత కు Congratulations చెబుతూ ట్వీట్స్,మేసేజ్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ అలాగే పలువురు సెలబ్రెటీస్ .

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news