Gossips"బాల‌కృష్ణ సార్ పక్కన హీరోయిన్ గా చేయను.. ఆ రోల్ అయితే...

“బాల‌కృష్ణ సార్ పక్కన హీరోయిన్ గా చేయను.. ఆ రోల్ అయితే ఓకే”..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన వయ్యారి భామ..?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రెడీ అవుతున్నారు. మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ సినిమాను బాల‌య్య ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాపై కూడా అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా థ‌మ‌నే మ్యూజిక్ అందిస్తున్నారు. ఓ వాస్త‌వ సంఘ‌ట‌న ఆధారంగా గోపీచంద్ ఈ సినిమా క‌థ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. శృతీహాస‌న్‌, మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా ఫైన‌ల్ అయ్యార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌నే బాల‌య్య కోసం మ‌లినేని ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..

గోపీచంద్ మ‌లినేని విజ్ఞ‌ప్తిని క్రాక్ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న‌ శృతిహాస‌న్ సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట. “బాలయ్య పక్కన హీరోయిన్ గ చేయలేను .. కానీ మీ కోసం ..సెంటిమెంట్ ను కాద‌న‌లేక గెస్ట్ రోల్ అయితే చేస్తాన‌ని” శృతిహాస‌న్ చెప్పిన‌ట్టు వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఈ న్యూస్ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో గోపీచంద్ మ‌లినేని వేరే హీరోయిన్ సంప్ర‌దించే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news