Gossipsబిగ్ బ్రేకింగ్ : లీకైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్..?

బిగ్ బ్రేకింగ్ : లీకైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్..?

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. అయితే, ప్రేక్షకులు ఎప్పుడేప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 అతి త్వరలోనే మనముందుకు రానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ఓ అదిదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. త్వరలో మీ అందరిని పలకరించేందుకు ముందు వస్తున్నామంటూ అధికారికంగా స్టార్ మా లో తెలిపారు షో మేకర్స్. అయితే తాజాగా వదిలిన ఐదో సీజన్ లోగో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ రియాల్టీ షో గురించి వచ్చిన అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది.

ఈ సారి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే బిగ్‌బాస్ కోసం అదిరిపోయే సెట్ వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయ‌ట‌. అస‌లు ఈ బిగ్‌బాస్‌లోకి ఎవ‌రెవ‌రు వ‌స్తారు ? అన్న‌దానిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా నాలుగో సీజ‌న్ త‌ర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన వారికి మంచి పాపులారిటీ వ‌స్తుండ‌డంతో ఐదో సీజ‌న్లోకి వెళ్లేందుకు బుల్లితెర సెల‌బ్రిటీలు, సినిమాల్లో అవుట్ డేటెడ్ అయిన వాళ్లు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ వచ్చే సెప్టెంబర్ 5వ తేదిన మొదలు పెట్టాలనీ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ గా మారాయి.

ఆ లిస్ట్ లో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ విష్ణు ప్రియ పేర్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news