Moviesఓహో.. అది అసలు మ్యాటర్..అందుకని నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడా..??

ఓహో.. అది అసలు మ్యాటర్..అందుకని నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడా..??

ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. అలా తమ జివిత భాగస్వాములకు విడాకులు ఇచ్చిన ఫిల్మ్ సెలబ్రిటీలు మరోకరిని పెల్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఒక్కరు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. టాలీవుడ్ లో లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా వెండితెరకు పరిచయమైన నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక శివ గా.. ఒక కింగ్ గా.. ఒక మన్మధుడు గా… ఒక అన్నమయ్య గా ఇలా ఎన్నో పాత్రలతో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారు. అయితే నాగార్జున సినిమా రంగంలో తిరుగులేని హీరోగా ఉన్నా వ్యక్తిగత జీవిత విషయంలో విషయానికొస్తే కాస్త ఇబ్బంది పడ్డారు. ఈయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అక్కినేని అమల గారు ఈయన రెండో భార్య. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక ఈమెను పెళ్లి చేసుకున్నారు నాగార్జున.మొదట టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మీతో నాగార్జున వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగ చైతన్య.

నాగ్‌కు స‌రైన హిట్లు లేక సతమతం అవుతున్న తరుణంలో.. నాగార్జున – శ్రీ లక్ష్మి పెళ్లి జరిగింది. అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత వీరికి నాగచైతన్య పుట్టాక‌ మనస్పర్థలు తలెత్తాయి. అది ఎంతల అంటే.. పెద్దలు ఎంత సర్ది చెప్పినా కూడా కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. నాగార్జున అప్పుడప్పుడే కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉండడంతో.. షూటింగ్ లు అంటూ పలు ప్రాంతాల్లో ఉండటం.. విదేశాలకు వెళుతుండటంతో ఫ్యామిలీ కి ఎక్కువ సమయం కేటాయించడం లేదన్న అసంతృప్తి.. ఇటు నాగచైతన్యతో శ్రీలక్ష్మి ఒంటరిగా ఉండాల్సి పరిస్ధితిలు … అదే టైంలో నాగార్జున – అమల తో సినిమాలు చేస్తున్న క్రమంలో ప్రేమలో పడటం… చివరకు శ్రీలక్ష్మికి దూరమై విడాకులు ఇచ్చేసారు. అయితే ఈ జంటలు విడిపోయినా ఎవరి లైఫ్ వాళ్లు బాగానే సెటిల్ చేసుకున్నారు.. వాళ్ల కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news